
ఊరంతా.. ఏకోదంత..
మంథనిరూరల్: మంథని మండలం బెస్తపల్లిలో 30 ఏళ్లకు పైగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఉండడం ఒక కారణమైతే, అందరూ కలిసికట్టుగా ఒకే మాటపై ఉంటారు. 1990లో నలుగురు వ్యక్తులు గణనాథుడిని ప్రతిష్టించాలని నిర్ణయానికొచ్చారు. నాడు తాటాకులతో మండపం వేసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. తోకల రాజయ్య, మండి మల్లయ్య, మంచెర్ల మల్లేశ్, ధర్మాజి ఎల్లయ్య, ధర్మాజి నగేశ్ మొదటిసారి గణనాథుడి విగ్రహం తీసుకువచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
ప్రథమ పూజలందుకునే గణపయ్య నవరాత్రి ఉత్సవాలకు మండపాలు సిద్ధమవుతున్నాయి.. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలో పలువురు భక్తి భావంతో పాటు సామాజిక బాధ్యతలను నిర్వర్థిస్తున్నారు. కొందరు 75 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తూ భక్తిని చాటుతుండగా.. మరికొందరు ఏళ్ల తరబడిగా మట్టి గణపయ్యను ప్రతిష్టిస్తూ.. సంచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ రక్షణకు పాటుపడుతున్నారు. ఇంకొందరు విగ్రహాలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. మంథని మండలంలోని ఓ ఊరిలో గ్రామస్తులందరూ ఒకే విగ్రహం ఏర్పాటు చేసి ఐకమత్యం చాటుతున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల
సందర్భంగా కథనాలు..