
హిందూ సేవక్ సమితి ఆదర్శం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో ఏటా వినాయక ఉత్సవాల్లో హిందూ సేవక్ సమితి గణపతి హైలెట్‌గా నిలుస్తున్నారు. పర్యావరణ హితమే తమ అభిమతమని యువత భక్తిభావంతో పాటు సామాజిక స్పృహను చాటుతున్నారు. 15 ఏళ్లుగా స్థానిక పద్మనగర్‌కు చెందిన హిందూ సేవక్ సమితి నిర్వాహకులు మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్నారు. వడ్లకొండ దేవదాస్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు ఒక్కో ఏడాది వినాయకుడు ఒక్కో రూపంలో ఉండేలా చూస్తున్నారు. 10 నుంచి 14 అడుగుల ఎత్తులో ఉండే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రత్యేకత. చందాలకు వెళ్లకుండానే సొంత డబ్బులతో 25 మంది యువకులు కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసి వేడుకలు జరుపుతున్నారు.