
కరీంనగర్ తొలి గణపతి
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లో మొదటిసారిగా 1950లో పాతబజార్‌లోని చిన్న హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభించారు. బ్యాంక్ ఉద్యోగి ఆర్.పెంటయ్య సహకారంతో కె.నర్సయ్య, పి. నందయ్య, పి.ఓంకార్, రామన్న, ఆ ప్రాంతవర్తకుల ఆధ్వర్యంలో మంగళపెల్లి గోపాల్‌కృష్ణయ్యశర్మ, శంకర్‌శర్మ నేతృత్వంలో రాగిమట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈసారి 75 ఏళ్ల వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం రోజు టవర్ సర్కిల్‌లో పాతబజార్ గణపతి తుది పూజలు అందుకున్న తర్వాతే శోభాయాత్ర ప్రారంభమవుతోంది.