● ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు
● దోమలకు అడ్డా.. కనిపించని స్ప్రే
● ముసురుతున్న రోగాలు
● ఆందోళనలో పట్టణవాసులు
జగిత్యాల: fW™éÅÌS hÌêÏ MóS…{§ýl…, A†ò³§ýlª Ð]l¬°Þ´ë-Ísîæ-ÌZ Ð]lÆ>Û-M>ÌS…ÌZ ´ëÇÔ¶æ$-«§ýlÅ… AçÜ¢-Ð]lÅ-çÜ¢…V> Ð]l*Æý‡$-™ø…¨. _¯]l²-´ësìæ Ð]lÆ>Û-ÌSMóS {yðlƇ$$-¯ól-iË$ ´÷…W, Rêä çܦÌêÌZÏ Ð]l¬ÇMìS-±Æý‡$ °Í_, í³_aÐðl¬-MýSP-Ë$ §ýlrt…-V> ò³Æý‡$-VýS$-™èl$-¯é²Æ‡$$. ÐéÅ«§ýl$ Ë¿¶æÄ¶æ$…™ø AÌêÏyýl$™èl$¯é²Æý‡$.న’ ´ëÏr$Ï Mö¯]l$-VøË$ ^ólíÜ {V>Ð]l*-ÌZÏ °Ð]l-íÜ-çÜ$¢¯]l² Ķæ$fÐ]l*-¯]l$-Ë$ D Rêä çܦÌêÌS¯]l$ ç³sìæt…^èl$-MøMýS-´ù-Ð]l-yýl…-™ø çÜÐ]l$çÜÅ Ð]l$Ç…™èl ¡{Ð]l-Ð]l$-Ð]l#-™ø…¨. ѧéÅ-¯]l-VýS-ÆŠæ, MýS–Úë~-¯]l-VýS-ÆŠæ, O»ñæ´ë-‹Ü ÆøyŠæ, VøÑ…-§ýl-ç³-ÍÏ Ð]l…sìæ ÕÐéÆý‡$ M>ÌS-±ÌZÏ D çÜÐ]l$çÜÅ A«¨MýS…-V> MýS°í³-çÜ$¢…¨. Ð]l¬°Þç³ÌŒæ A«¨ M>Æý‡$-Ë$ ¯øsîæ-çÜ$-Ë$ gêÈ ^ólĶæ$-MýS-´ù-Ð]lyýl…, fÇÐ]l*-¯éË$ Ñ«¨…-^èl-MýS-´ù-Ð]lyýl… Ð]lÌSÏ çÜÐ]l$-çÜÅ-Ë$ ç³ÇÚëP Æý‡… M>Ð]lyýl… Ìôæ§ýl° Ý린MýS$-Ë$ BÆøí³-çÜ$¢-¯é²Æý‡$.
ఖాళీ స్థలాలతో ఆరోగ్య ఆందోళనలు
స్థలాల్లో దట్టంగా పెరిగిన పిచ్చిమొక్కలు, నిలిచిన మురికినీరు విషపూరి, పాములు, దోమలు, ఈగలకు ఆవాసంగా మారాయి. దీంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు ప్రబలుతున్నాయి. నిబంధనల ప్రకారం, మున్సిపల్ అధికారులు ఈ స్థలాలను శుభ్రం చేసి, యజమానుల నుంచి ఖర్చు వసూలు చేయవచ్చు. అయితే, ఈ విధానం అమలు కావడం లేదు. బ్లీచింగ్ పౌడర్, కెమికల్ స్ప్రే వంటి చర్యలు కూడా బ్లాక్ స్పాట్స్ ఉన్న చోట మాత్రమే చేపడుతున్నారని, డ్రెయినేజీలపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఫాగింగ్ అందని కాలనీలు
వర్షకాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమల సంచారం పెరిగింది. అయితే, కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే ఫాగింగ్ చేస్తుండగా, ఇతర కాలనీల్లో ఈ చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల సంఖ్య అధికమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విష సర్పాలు, పురుగుల భయం
ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు, దట్టమైన పిచ్చిమొక్కలు విష సర్పాలు, జెర్రీలు, ఇతర విషపురుగులకు ఆవాసంగా మారాయి. సాయంత్రం వేళల్లో ఇవి ఇళ్లలోకి చొరబడుతుండడంతో కాలనీవాసులు భయా ందోళనకు గురవుతున్నారు. తలుపులు మూసుకోకపోతే ఇబ్బందులు తప్పడం లేదని వారు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డ్రెయినేజీల నిర్మాణంలో లోపాలు
మున్సిపాలిటీలో డ్రెయినేజీల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో చిన్న వర్షానికే పొంగిపొర్లుతున్నా యి. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెయినేజీలు నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. 100 రోజుల పారి శుధ్య ప్రణాళిక అమలవుతున్నప్పటికీ, ఖాళీ స్థలా ల్లోని పిచ్చిమొక్కలు, మురికినీరు సమస్యలను పరి ష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
పరిష్కార మార్గాలు
మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఖాళీ స్థలాల్లోని పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రెయినేజీలను సక్రమంగా ఏర్పాటు చేయడం, ఫాగింగ్‌ను అన్ని కాలనీల్లో నిర్వహించడం, యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టాలి. ఇలా చేస్తే జగిత్యాలలో పారిశుధ్య సమస్యలు తగ్గి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది.
జగిత్యాల మున్సిపాలిటీ
వార్డులు : 48
జనాభా : 1,20,357
సిబ్బంది : 296
నోటీసులు జారీ చేసేలా చర్యలు
ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు తొలగించని యజమానులకు నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటాం. ఖాళీ స్థలాల్లో బోర్డులు సైతం ఏర్పాటు చేసేలా చూస్తాం. ఒకవేళ వారు స్పందించకపోతే చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, టీపీవో
ఇది విద్యానగర్‌కాలనీలోని సీతారామాంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన భూమి. ఇక్కడ ఇంతకు ముందు డంపర్‌బిన్ ఏర్పాటు చేసే వారు. ప్రస్తుతం డంపర్‌బిన్ లేకపోవడంతో అక్కడే చెత్త పోస్తున్నారు. దీంతో పాటు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. వర్షానికి అందులో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. చుట్టు పక్కల గల భవనాల వారికి రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరుతున్నారు.
వ్యాధుల భయం
వ్యాధుల భయం