
అడవులు తగ్గడంతోనే జనావాసాల్లోకి కోతులు
డీఎఫ్‌వో రవిప్రసాద్
రాయికల్: అడవుల్లో చెట్లు తగ్గిపోవడంతోనే జనావాసాల్లోకి కోతులు వస్తున్నాయని డీఎఫ్‌వో రవిప్రసాద్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏక్ పేడ్ మా కేనామ్ పేరున బుధవారం మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో భూమేశ్, ఎంఈవో రాఘవులు, నాయకులు స్వప్న, దొంతి నాగరాజు, బొప్పారపు మానస, హెచ్‌ఎంలు దేవలక్ష్మీ, ఉపాధ్యాయులు కడకుంట్ల అభయ్‌రాజ్, హరికృష్ణ, వినోద్, వనిత, పద్మావతి పాల్గొన్నారు.