
నెలరోజులుగా కాపలా
నేను రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేశాను. నెలరోజులుగా కోతులు రాకుండా భార్యభర్తలం చెరోవైపు కాపలా ఉంటున్నాం. అయినప్పటికీ రామచిలుకలు గింజలను నష్టం చేస్తున్నాయి. మరికొన్ని రోజులు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
– చీటేటి జీవన్ రెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి
కోతులతో పంట ధ్వంసం
ఓవైపు రామచిలుకలు, మరోవైపు కోతులతో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. ఉదయం, సాయంత్రం అని కాకుండా రోజంతా కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు కాపలాగా వెళ్లినప్పటికి పంటను నష్టం చేస్తూనే ఉన్నాయి. పక్షలు, కోతులతో జరిగే పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం అందించాలి.
– యాల్ల శ్రీనివాస్ రెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి

నెలరోజులుగా కాపలా