
భూసమస్యలను సత్వరమే పరిష్కరించాలి
మల్లాపూర్: భూ సమస్యలు, ఇతర ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూభారతికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆమె వెంట తహశీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, ఎంపీవో జగదీశ్, ఆర్‌ఐ రాజేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.