
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశమయ్యారు. వందశాతం ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి కావాలని, ఇసుక, కంకర, ధరలపై నియంత్రణ ఉండేలా కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మండలస్థాయి, మున్సిపల్, స్పెషల్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. దశలవారీగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.