బైక్.. టిప్పర్.. బస్సు ఢీ
● ముగ్గురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
మల్యాల(చొప్పదండి): ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని, హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడిన సంఘటన మ ల్యాల మండలంలోని రాజారం గ్రా మ శివారులో చోటుచేసుకుంది. శుక్రవారం జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న టిప్పర్ రాజారం శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు నీరజ్‌తోపాటు మరో ఇద్దరు గాయపడగా, 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. బైక్‌ను ఢీకొన్న లారీ డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక ఉన్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగిలి, ముందుభాగం దెబ్బతిన్నది. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


