సహకార సంఘాల్లో బదిలీలు
కథలాపూర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న అధికారులకు బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. వీరంతా ఏళ్ల తరబడిగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు బదిలీ చేపట్టాలని ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. ఇందుకోసం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో 51 సహకార సంఘాలు.. 148 మంది ఉద్యోగులు
జిల్లాలో 20 మండలాల పరిధిలో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో సీఈవోలు 42 మంది, స్టాఫ్ అసిస్టెంట్లు 106 మంది పనిచేస్తున్నారు. ఇతర సిబ్బంది తాత్కలిక పద్ధతిలో పనిచేస్తున్నారు. సీఈవోలతోపాటు స్టాఫ్ అసిస్టెంట్లను బదిలీ చేయనున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట పనిచేస్తుండడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిగా బదిలీలు
కొత్త జిల్లాల వారీగా డీసీసీబీలు లేకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిగానే బదిలీలు చేపడుతారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కమిటీని నియమించారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీసీవో, నాబార్డు డీడీఎం, డీసీసీబీ జీఎం, డీజీఎంలు కన్వీనర్లుగా ఉంటారు.
కసరత్తు చేస్తున్న అధికారులు
జిల్లాలో 51 పీఏసీఎస్‌లు.. 148 మంది ఉద్యోగులు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న అధికారుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏళ్లతరబడి ఉద్యోగుల బదిలీలు జరగలేదు. ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిలో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తాం.
– మనోజ్‌కుమార్, డీసీవో
సహకార సంఘాల్లో బదిలీలు


