ఘనంగా శంకరాచార్యుల జయంతి
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం జగద్గురు ఆది శంకరాచార్యులు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో స్వామివారితో పాటు శారదాదేవికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అష్టోత్తరపూజ, మన్యసూక్తం, పంచోపనిషత్‌లతో అభిషేకం తదితర పూజలు జరిపారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, వేదపండితులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
కొచ్చెరువు మత్తడి పరిశీలన
కథలాపూర్: మండలంలోని గంభీర్‌పూర్ గ్రామశివారులో శిథిలావస్థలో ఉన్న కొచ్చెరువు మత్తడిని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రమేశ్ శుక్రవారం పరిశీలించారు. మత్తడి మరమ్మతులకు గతేడాది రూ.39 లక్షలు మంజూరు చేయగా, నిధులు సరిపోవని పనులు చేపట్టలేదు. మత్తడిని పూర్తిగా తొలగించి నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. మత్తడి నిర్మాణానికి రూ.50 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేస్తామని అధికారులు తెలిపారు. ఆయన వెంట సిరిసిల్ల ఈఈ అమరేందర్‌రెడ్డి, డీఈ ప్రశాంత్, ఏఈ నవీన్, రాజు, నాయకులు కల్లెడ గంగాధర్, పోతు శేఖర్ ఉన్నారు.
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
కోరుట్ల/మెట్‌పల్లి: న్యాయవాదుల సంక్షేమానికి బార్ కౌన్సిల్ కృషి చేస్తోందని రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కుంచ సునీల్‌గౌడ్ అన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో శుక్రవారం బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై న్యాయవాదుల హక్కుల రక్షణ కోసం తీసుకవచ్చిన ప్రొటెక్షన్ యాక్ట్‌లో తమ పాత్రను వివరించారు. బార్ కౌన్సిల్ అమలు చేస్తున్న పథకాలతోపాటు తదితర విషయాలపై చర్చించారు. అనంతరం సునీల్‌గౌడ్‌ను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్, న్యాయవాదులు రమేశ్, రాజశేఖర్, ప్రేమ్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
5న కొండగట్టు ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఈనెల 5న లెక్కించనున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు తెలిపారు. ఔత్సాహిక భక్తులు పాల్గొనవచ్చని అన్నారు.
గెలుపు ఓటములు
సమానంగా తీసుకోవాలి
జగిత్యాల: గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి జగిత్యాలలోని మినీస్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ గెలుపు ఓటములను సమానంగా తీసుకొని క్రీడలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌వో రవికుమార్, మాజీ లైబ్రరీ డైరెక్టర్ సుధాకర్, మాజీ కౌన్సిలర్ నవీన్, శరత్‌రావు పాల్గొన్నారు.
ఘనంగా శంకరాచార్యుల జయంతి
ఘనంగా శంకరాచార్యుల జయంతి
ఘనంగా శంకరాచార్యుల జయంతి


