జీవాల దాహం తీర్చుదాం | - | Sakshi
Sakshi News home page

జీవాల దాహం తీర్చుదాం

May 2 2025 1:14 AM | Updated on May 2 2025 1:14 AM

జీవాల

జీవాల దాహం తీర్చుదాం

కోల్‌సిటీ(రామగుండం): వేసవిలో నీటి కోసం జనాలు అల్లాడిపోతారు. వివిధ అవసరాల కోసం ఇంట్లోంచి బయటకు వెళ్తే.. దాహం తీర్చుకునేందుకు నీళ్లు ఎక్కడ లభిస్తాయా? అని ఆశ పడతారు. ఎప్పటికప్పుడు దాహం తీర్చుకునేందుకు తహతహలాడతారు. మరి మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుంది? అవి దాహం ఎలా తీర్చుకుంటాయి? మనం ఏమైనా ప్రయత్నం చేస్తే వాటి దాహం తీరుతుందా? ఇలాంటి సందేహాలకు సమాధానమిస్తున్నారు కొందరు పక్షులు, జీవాల ప్రేమికులు.

పక్షుల శరీర ఉష్ణోగ్రతలు అత్యధికం..

సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని పక్షిప్రేమికులు చెబుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు దాటితే ఎక్కువ సేపు అవి జీవించలేవని అంటున్నారు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతలు తగ్గించుకుంటాయి. జనం కోసమైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? వీటి కోసం ఎవరు ఆలోచిస్తారు? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో నమోదవుతున్నాయి. అందుకే మూగజీవాలకు ఊపిరి పోయడానికి మనమే ఒకడుగు ముందుకేద్దాం. ఇంటి ఆవరణ, ఇంటి బయట కాసిన్ని నీళ్లు పెట్టి వాటి దాహం తీర్చుదాం.

అందరూ స్పందించాలి

ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధికుక్కలు, పక్షుల దాహం తీర్చేందుకు ప్రతీ ఒక్కరు స్పందించాలి. ప్రభుత్వంతోపాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ఎదుట, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబాపై తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అయితే బల్దియా ఆధ్వర్యంలో గతేడాది వేసవిలో సుమారు 90 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేసి నీళ్లు పోశారు. వీటిని ప్రస్తుతం పట్టించుకున్న నాథుడు లేడు. కొందరు స్థానికుల ఇళ్ల ఎదుట, దుకాణాల మందున్న తొట్టెల్లో నీళ్లు పోసి దాహం తీర్చుతున్నారు. ఇలాగే ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తే మంచిదని మూగజీవాల ప్రేమికులు కోరుతున్నారు.

పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు

తల్లడిల్లుతున్న పక్షులు, జంతువులు

నివాసాలు, ఖాళీ ప్రదేశాల్లో నీటితొట్టెలు

జీవాల దాహం తీర్చుదాం 1
1/2

జీవాల దాహం తీర్చుదాం

జీవాల దాహం తీర్చుదాం 2
2/2

జీవాల దాహం తీర్చుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement