కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
కోరుట్ల రూరల్: ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని అయిలాపూర్, ధర్మారం, కల్లూర్, సర్పరాజ్‌పూర్, మోహన్‌రావుపేట, వెంకటాపూర్, మాదా పూర్ గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం నరహరి, ప్యాక్స్ చైర్మన్ ఆదిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ధాన్యంలో కోతలు పెట్టొద్దు
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం తూకంలో కోతలు పెట్టకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. చల్‌గల్ మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మిల్లర్లు ఎలాంటి కోతలు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే తేవాలన్నారు. తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. డీసీఓ మనోజ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్, నాయకులు బాల ముకుందం, సురేందర్‌రావు, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి


