అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి
మల్యాల: కొండగట్టు అంజన్నను శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దర్శించుకున్నారు. నూతన వాహనానికి పూజ చేయించారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్
జగిత్యాల: వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని, ప్రతిఒక్కరూ వేసుకోవాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు హేమంత్ అన్నారు. శనివారం ఐఎంఏ హాల్‌లో పలువురు యువతులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఐఎంఏ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మిని, సుదీర్‌కుమార్, స్వరూప పాల్గొన్నారు.
ఖోఖో జాతీయ పోటీలకు రాములపల్లి యువకుడు
పెగడపల్లి: కాజీపేటలో ఈనెల 11నుంచి జరిగే 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్‌షిప్ పురుషుల జట్టుకు పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన యువకుడు ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన బిడుదుల లచ్చయ్య, సాయవ్వ దంపతుల కుమారుడు నరేశ్ చిన్నప్పటినుంచి ఖోఖో పోటీలో రాణిస్తున్నాడు. 20సార్లు జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 40 రోజుల పాటు జరి గిన క్యాంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. తాజాగా సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్‌షిప్ పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు.
అందరి సహకారంతో నేరాల అదుపు
జగిత్యాలక్రైం: సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంత గ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు పడే అవకాశం ఉందని, ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లాలని, లేకుంటే బ్యాంకులో దాచి పెట్టుకోవాలని సూచించారు. చోరీల నియంత్రణపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని, రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేశామన్నారు. అపరిచితులు వచ్చి సమాచారం అడిగితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి
అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి


