కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య
మెట్‌పల్లి: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. పట్టణంలోని 12వార్డుకు చెందిన పలువురు శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ముఖీం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, దీనివల్లనే సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కొమొరెడ్డి విజయ్‌అజాద్, జెట్టి లింగం, రైసుద్దీన్, హఫీజ్, అక్తర్‌జానీ, లతీఫ్ తదితరులున్నారు.


