అభ్యంతరాల పరిశీలన
వార్డులవారీగా ఓటరు జాబితాపై కసరత్తు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు
జగిత్యాల
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
I
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఈనెల ఒకటిన మున్సిపల్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబి తా విడుదల చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎన్నికల అధికారులు అభ్యంతరాలను స్వీకరించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల నుంచి జాబితాలో తొలిగిన తప్పులపై ఆశావహులు, ప్రజల నుంచి అత్యధికంగా అభ్యంతరాలు వచ్చా యి. ఈనెల 12లోపు తుది జాబితా రూపొందించి 16న ఫొటోలతో కూడిన జాబితా విడుదల చేయనున్నారు. అత్యధికంగా అభ్యంతరాలు రావడంతో అధికారులు క్షు ణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటిని సవరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు స్వీకరించారు. ఓటరు జాబితా విషయంపై చర్చించారు. అధికారులు మాత్రం ప్రజలు ఓటరు జాబితాపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, పూర్తిస్థాయిలో సవరిస్తున్నామని అధికారులు తెలిపారు. సమయం తక్కువగా ఉండటంతో ఈనెల 16లోపు సవరణ జరుగుతుందా..? లేదా..? అన్న ఆందోళనలో ఆశావహులు, ప్రజలు ఉన్నారు. ఎన్ని కల సంఘం ఈనెల 10న తుది జాబితా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ 16న ఓటరు తుది జాబితా వెల్లడించనున్నట్లు తెలిపింది. అంతకుముందే ఈనెల 13న టీపోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలోనే అత్యధికంగా 99కిపైగా అభ్యంతరాలు వచ్చాయి. కోరుట్ల, మెట్‌పల్లిలోనూ వచ్చాయి. రాయికల్, ధర్మపురి చిన్న మున్సిపాలిటీలు కావడంతో అక్కడ పెద్దగా ఇబ్బందులేమీ కన్పించడం లేదు. టీపోల్ యాప్‌లో ధరూర్ గ్రామపంచాయతీకి చెందిన ఓ కాలనీ మొత్తం ఓటర్లు రావడంతో ఆ గ్రామానికి చెందిన ఓటర్లన్నీ జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయిలో అభ్యంతరాలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని తొలగిస్తూ సవరిస్తున్నారు. అలాగే ఒక వార్డులోని ఓటర్లు మరో వార్డులోకి రావడంతో వాటిపై కసరత్తు చేస్తున్నారు.
ఆశావహులు, ప్రజల్లో ఆందోళన
ఓటరు జాబితాపై అటు ప్రజలు, ఇటు ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఓటరుగా ఉన్న వారు వేరే వార్డులోకి వెళ్లడంతో తమకు అనుకూలంగా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఆ రిజర్వేషన్లు అనుకూలిస్తాయో లేదోనన్న ఆందోళన మరోవైపు ఉంది. అధికారులు మాత్రం ఓటరు జాబితాపై ఆందోళన చెందవద్దని, అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే చేపడతామని పేర్కొంటున్నారు.
అభ్యంతరాల పరిశీలన


