అగ్నిమాపక కేంద్రంపై కదలని ఫైల్
● సీఎం దృష్టికి తీసుకెళ్లిన మాజీమంత్రి ● ఫైర్, ఫిల్టర్‌బెడ్‌కు మోక్షం లేదు
రాయికల్: రాయికల్ పట్టణంలోని ఫిల్టర్‌బెడ్, అగ్నిమాపక కేంద్రాల ఫైళ్లు సీఎం వద్దకు వెళ్లినా మోక్షం కలగడం లేదు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ రెండు సమస్యలపై గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినప్పటికీ ఫిల్టర్‌బెడ్, అగ్నిమాపక కేంద్రం మంజూరు మాత్రం కలగానే మిగిలింది. రాయికల్ పట్టణంతో పాటు, మండలంలోని 32 గ్రామాలకు ఎలాంటి అగ్నిప్రమాదం జరిగినా నివారించడానికి ఈ అగ్నిప్రమాద కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.
రూ.ఐదు కోట్లతో ప్రతిపాదనలు
రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని 32 గ్రామాల్లో ఎలాంటి అగ్నిప్రమాదం జరిగినా నివారించడానికి 2012లో రెండేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిన అప్పటి మంత్రి, స్వర్గీయ జువ్వాడి రత్నాకర్‌రావు ఇక్కడ అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. 2014లో కాంట్రాక్ట్ ముగియడంతో అగ్నిమాపక యంత్రం తరలిపోయింది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గతేడాది జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి అగ్నిమాపక కేంద్రం పునరుద్ధరణకు రూ.5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన సీఎం సంబంధిత శాఖ డీజీపీతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏడాది గడుస్తున్నప్పటికీ అగ్నిమాపక కేంద్రానికి మాత్రం మోక్షం కలగడం లేదు.
ఫిల్టర్‌బెడ్‌రూ రూ.1.50 కోట్లుతో ప్రతిపాదనలు
రూ.6 కోట్ల వ్యయంతో సమగ్ర నీటి పథకం ద్వారా 2007లో ఫిల్టర్‌బెడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా 2014లో పూర్తయింది. కొన్ని నెలలు మాత్రమే ఫిలర్‌బెడ్ ద్వారా గ్రామాలకు తా గునీటిని సరఫరా చేశారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీరందిస్తామని హామీ ఇచ్చి విస్మరించడంతో పట్టణంతోపాటు రాయికల్, రామాజీపేట, భూపతిపూర్, కుమ్మరిపల్లి, ఇటిక్యాలకు శుద్ధజలం అందలేదు. ఈ విషయాన్ని కూడా జీవన్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఫిల్టర్‌బెడ్ పునరుద్ధరణకు రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీంతో అధికారులు యంత్రాల నిర్వహణకు ప్రతిపాదనలు తయారుచేశారు. నిధులు విడుదలై.. ఫిల్టర్‌బెడ్ పునరుద్ధరణ జరిగితే ఆయా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీరుతుంది.
ఫిల్టర్‌బెడ్
సీఎంకు వినతిపత్రం అందిస్తున్న జీవన్‌రెడ్డి (ఫైల్)
అగ్నిమాపక కేంద్రంపై కదలని ఫైల్
అగ్నిమాపక కేంద్రంపై కదలని ఫైల్


