భవిష్యత్‌కు మూలం విద్య
మల్యాల(చొప్పదండి): మండలకేంద్రంలోని కసూరిబా పాఠశాలను శుక్రవారం కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్య, స్థితిగతులను తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు పట్టిక, నోటుబుక్కులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన, భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని, ఉపాధ్యాయులు తప్పనిసరిగా సయమపాలన పాటించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు విద్య మూలమని, ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టిసారించాని సూచించారు. ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, ఎంఈవో జయసింహారావు, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


