‘పుర’ పోరుకు కసరత్తు
రిజర్వేషన్లపైనే ఆసక్తి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు వేగవంతంగా కసరత్తు చేస్తున్నారు. ఓటరు ముసాయిదా తుది జాబితా ఈనెల 16న విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇప్పటికే జిల్లా అధికారులు నామినేషన్ పత్రాల స్వీకరణ, ఉపసంహరణకు సంబంధించి రిటర్నింగ్ అధికారి, స హాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. జి ల్లాలో ఐదు మున్సిపాల్టీలు ఉండగా, మూడు వార్డులకు ఒక క్లస్టర్‌లా ఏర్పాటు చేసి అధికారులను ని యమించారు. వీరు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈనెల 16న ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
ఆశావహుల సన్నాహాలు
మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఇప్పటికే ఆశావహులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పోటీచేసిన తాజామాజీ కౌన్సిలర్లతో పాటు, ఓడిపోయినవారు, కొత్త అభ్యర్థులు, యువత కౌన్సిలర్ పదవులు దక్కించుకోవాలని ఎదురుచూస్తున్నారు. కొంత మంది వార్డుల్లో ప్రచారం సైతం మొదలుపెట్టినా రిజర్వేషన్ అనుకూలిస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మహిళలకు కేటాయిస్తే పతి స్థానంలో సతులను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
టికెట్ల కోసం ప్రయత్నాలు
మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కౌన్సిలర్, చైర్మన్ కోసం ఆశలు పెట్టుకున్న నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అత్యధికంగా జగిత్యాల చైర్మన్ సీటును కాంగ్రెస్ కై వసం చేసుకున్నప్పటికీ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 37 సీట్లకు పైగా గెలిచి చైర్మన్ పీఠం దక్కించుకుంది. కానీ అంతర్గత విభేదాల వల్ల అప్పటి చైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా చేయడం, ఇన్‌చార్జిగా ఉన్న వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చైర్‌పర్సన్‌గా జ్యోతి ఎన్నికై ంది. వారు ఎన్నికై న కొద్దిరోజులకే పాలకవర్గం రద్దయి ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైర్మన్, కౌన్సిలర్ల పదవీ కోసం మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ దక్కించుకున్న నేపథ్యంలో ఈసారి మళ్లీ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఇటీవలే ప్రభుత్వంతో పనిచేస్తున్నానని కాంగ్రెస్ వైపు ఉంటున్నారు. ఇటు జీవన్‌రెడ్డి సైతం సీనియర్ నాయకుడు కావడం, సంజయ్‌కుమార్ ప్రభుత్వంతో కలిసి పోతుండటంతో నాయకులంతా ఆందోళనలో ఉన్నారు. ఎవరికి టికెట్లు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉండటంతో ఈసారి పాగా వేస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇక బీఆర్‌ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈసారి మళ్లీ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపైనే ఆశావహులు దృష్టి సారిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ స్థా నంతో పాటు ఆయా వార్డుల్లో కౌన్సిలర్‌కు పోటీ చేయాలనుకున్నవారు రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండు విడతల్లో ఒకే రి జర్వేషన్ ఉండాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చి కొత్త రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ వార్డుల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు చైర్మన్ సీటు ఎవరికి వస్తుందోనని అంచనాలు వేస్తున్నారు.
‘పుర’ పోరుకు కసరత్తు


