నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు
కోరుట్ల/మెట్‌పల్లి: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు చేపడతామని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోరుట్ల, మెట్‌పల్లి పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. శస్త్ర చికిత్సలు, ఇతర పరీక్షల బిల్లుల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. సాధారణ ప్రసావాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతారాణి, వైద్యులు అంజిత్‌రెడ్డి, చైతన్యసుధా, విజయలక్ష్మి, వినోద్, రమేశ్, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.


