కేటీఆర్‌ను కలిసిన జిల్లా నాయకులు
జగిత్యాల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం ఆ పార్టీ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ అధ్యక్షుడు వి ద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎ మ్మెల్యే సంజయ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు.
ఎకరాకు రూ.8 లక్షల పరిహారం
కథలాపూర్(వేములవాడ): సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.8 లక్షలు పరిహారం ప్రభుత్వం మంజూరు చేస్తుందని కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అంబారిపేట రైతు వేదికలో భూనిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామ పరిధిలో 73 ఎకరాలు కాలువ పనులకు అవసరమన్నారు. అలాగే కథలాపూర్‌లోని కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని ఆర్డీవో తనిఖీ చేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ వినోద్, ఎంఈవో శ్రీనివాస్, ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్ అనిత, సర్పంచ్ వేముల లక్ష్మి, ఆర్‌ఐలు నాగేశ్, రవీందర్ పాల్గొన్నారు.
హామీ ఇచ్చి.. నెరవేర్చి..
మల్లాపూర్(కోరుట్ల): మండలంలోని రాఘవపేట సర్పంచ్ తోట శ్రీనివాస్ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. శుక్రవారం గ్రామంలోని బాధితురాలు నత్తి నర్సు ఇంటి వద్దకే వెళ్లి ఆమె భర్త మల్లయ్య మరణ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ నుంచి ఇచ్చే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను బాధితుల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తానని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ మద్దెల నర్సయ్య, కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు.
అర్హులకే ఇళ్ల స్థలాలు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): అర్హులకే ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రం శివారులోని సర్వే నంబర్ 440,441లోని ధర్మసాగర్‌కాలనీలో 33 మంది వలసదారులు అనుమతిలేకుండా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం కలెక్టర్‌కు విన్నవించడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్డీవో బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించకుండా రోజూ పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో గణేశ్ తదితరులున్నారు.
కేటీఆర్‌ను కలిసిన జిల్లా నాయకులు
కేటీఆర్‌ను కలిసిన జిల్లా నాయకులు


