విడతల వారీగా పని కల్పించడం సరికాదు
సారంగాపూర్(జగిత్యాల): సాంకేతిక కారణాలతో ఉపాధి కూలీలకు విడతల వారీగా పని కల్పించడం సరికాదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీదేవిపల్లి అటవీప్రాంతంలో పనులు చేస్తున్న కూలీల వ ద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. లక్ష్మీదేవిపల్లిలో రోజూ 800 మంది పనికి వచ్చే అవకా శం ఉండగా కేవలం 300 మందికి మాత్రమే పని కల్పిస్తున్నారని, అవసరమైతే మేట్‌లను పెంచి వారికి బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. దీనిపై డీఆర్‌డీవోతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ వి షయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నా రు. కూలీలకు సమ్మర్ అలవెన్స్ రూ.350– రూ.400 వరకు చెల్లించాలని ఇది కూడా ఇవ్వడం లేదని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలతో పాటు నిర్మలాసీతారామన్‌కు లేఖ రాస్తానని తెలిపారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు విడ్డూరంగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ లేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1 లక్ష రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని గుర్తు చేశారు. ఆయన వెంట కొల్వాయి విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, మండలాల అధ్యక్షులు కోండ్ర రాంచంద్రారెడ్డి, గుడిసె జితేందర్, సుభాష్, నాయకులు గంగారాం, భూమరావు, అఖిల్, అభిలాష్ ఉన్నారు.
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి


