నేడు జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత రాక
జగిత్యాల: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జిల్లాకు రానున్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ రజోతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి నాయకులకు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం
జగిత్యాలఅగ్రికల్చర్: సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని చాలా సహకార సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. సహకార వ్యవస్థ బలోపేతం జరిగితే మరిన్ని సౌకర్యాలు రైతులకు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సలహాదారు అశోక్‌కుమార్, సంఘ అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు గర్వందుల చిన్న గంగయ్య, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదాలపై అవగాహన పెరగాలి
జగిత్యాలక్రైం: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెరగాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం కొత్తబస్టాండ్ చౌరస్తాలో అగ్నిప్రమాదా లు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పట్టణాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తక్షణ మే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలన్నారు. స్థానికంగా ఉన్న వారు అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు కృషి చే యాలన్నారు. అనంతరం అగ్నిమాపక శాఖ అఽ దికారులు విన్యాసాలు చేపట్టారు. కార్యక్రమంలో ఎల్‌ఎఫ్ రవీందర్, జి.మధు పాల్గొన్నారు.
సూరమ్మ రిజర్వాయర్ కట్ట పనులు ప్రారంభం
కథలాపూర్: మండలం కలిగోట శివారులోగల సూరమ్మ రిజర్వాయర్ కట్ట పనులు మంగళవారం ప్రారంభించారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపాలన్నది లక్ష్యం. ఇటీవలే మత్తడి నిర్మాణం పూర్తి చేశారు. నెలరోజుల్లో కట్ట నిర్మాణం, తూము నిర్మాణం పూర్తి చేయిస్తామని అధికారులు అంటున్నారు. వానకాలం సీజన్ వరకు రిజర్వాయర్ అందుబాటులోకి రానుందని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అగ్నివీర్ దరఖాస్తు గడువు పొడిగింపు
జగిత్యాలటౌన్: ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ దరఖాస్తు గడువును ఈనెల 25వరకు పొడిగించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్తమ్మ తెలిపారు. ఇండియన్ ఆర్మీలో కేటగిరీల వారీగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ కం స్టోర్‌కీపర్, అగ్నివీర్ ట్రేడ్‌మెన్‌కు సంబంధించిన దరఖాస్తు గడువును ఈనెల 25 వరకు పొడించారని, అర్హులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత రాక
నేడు జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత రాక


