జై బోలో హనుమాన్‌కీ..
కోరుట్ల: ‘రామ లక్ష్మణ్ జానకీ..జై బోలో హనుమాన్‌కి’ అంటూ కోరుట్ల పట్టణం కాషాయమయమైంది. పట్టణంలో
మంగళవారం రాత్రి వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరసామి ఆలయం వద్ద విజయయాత్ర ప్రారంభం కాగా, గాంధీరోడ్, కార్గిల్ చౌక్, జాతీయ రహదారి మీదుగా కొత్త బస్టాండ్, అంబేడ్కర్‌నగర్ మీదుగా తిరిగి వేంకటేశ్వర ఆలయం వద్దకు చేరింది. వందలాది మంది హనుమాన్ దీక్షాపరులు, బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల జై హనుమాన్ నినిదాలతో కోరుట్ల పట్టణం మారుమోగింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ కోరుట్ల సెగ్మెంట్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, తదితరులు పాల్గొన్నారు.
జై బోలో హనుమాన్‌కీ..


