నాసిరకం సరుకులతో ప్రసాదం
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డూ, పులిహోరా, అన్నప్రసాదం తయారీలో నాసిరకం సరుకులు విని యోగిస్తున్నారు. హనుమాన్ జయంతికి లక్షలాది మంది భక్తులు రానుండటంతో నాసిరకం సరుకులు వినియోగిస్తే ఆలయ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉంది. కలెక్టర్ చొరవ తీసుకుని, నాణ్యమైన సరుకులతో ప్రసాదం తయారు చేసేలా చూడాలి. – పోచమ్మల ప్రవీణ్, ఽ
దర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, కొండగట్టు
హద్దులు చూపండి
కథలాపూర్ మండలం తుర్తి శివారులోని సర్వే నంబర్ 93/17లో ఖాతా నంబర్ 332 ద్వారా దళితులకు భూ పంపిణీ పథకం కింద నా భార్య పొడేటి మమతకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చింది. సమీపంలోని కొందరు మా భూమిలో మామిడి చెట్లు పెట్టారు. ఇదేమని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. సదరు భూమికి హద్దులు చూపి, సర్కారు అండగా నిలవాలి.
– పొడేటి తిరుపతి, తుర్తి, కథలాపూర్
నాసిరకం సరుకులతో ప్రసాదం


