చందాలతో ఏడు చెక్‌డ్యాంలకు నీరు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కొడిమ్యాల నాన్ ఆయకట్టు మండలం. సాగునీటి కోసం రైతులు ఎప్పుడూ పెద్ద యుద్ధమే చేస్తుంటారు. యాసంగిలో సాగు చేసిన వరి పంట తమ కళ్ల ఎదుటే ఎండుతుంటే చూడలేక రైతులు తలా కొంత చందాలు వేసుకుని పంటలకు నీరు అందించుకుంటున్నారు. కొడిమ్యాల మండలం పూడూరు వాగు సమీపంలో ఏడు చెక్ డ్యాంలు ఉన్నాయి. అందులో ఉన్న నీటిని వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని పంటలు సాగు చేస్తుంటారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోయింది. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు రైతులు తలా కొంత చందాలు వేసుకుని రూ.లక్ష జమ చేసుకున్నారు. వాటితో 40 పైపులు కొనుగోలు చేసి కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి నుంచి నీటిని తరలించారు. ఆ నీటితో కొడిమ్యాల పెద్దవాగు, పూడూరు వాగుపై నిర్మించిన ఏడు చెక్ డ్యాంలు నిండి జలకళతో పొంగి పోర్లుతుండటంతో రైతులు సంతోషిస్తున్నారు. దీనివల్ల 500 ఎకరాలకు సాగునీరందుతోంది.
500 ఎకరాల వరి పంటను కాపాడుకున్న రైతులు
చందాలతో ఏడు చెక్‌డ్యాంలకు నీరు


