రాయికల్: రాయికల్ మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన నీరందిస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఫిల్టర్‌బెడ్‌ను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. జగిత్యాల నియోజకవర్గంలో ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతు కోసం రూ.14 కోట్లు మంజూ రయ్యాయని, యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి నెలలోపు తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పట్టణంలో 9, 10, 11 వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని, పైప్‌లైన్ బూస్టర్ పంప్ బోర్‌వెల్ ద్వారా సరఫరా చేయాలని సూచించారు. పట్టణంలో అమృత్–2 పథకానికి స్థల సేకరణ చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్ మనోహర్‌గౌడ్, ఇరిగేషన్ డీఈ జలేందర్‌రెడ్డి, ఏఈలు ప్రసాద్, దీపక్, చంద్రకాంత్, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, మాజీ సర్పంచ్ ఎద్దండి భూమారెడ్డి, బాపురపు నర్సయ్య, బత్తిని భూమయ్య, శ్రీకాంత్, రమేశ్, సంతోష్ పాల్గొన్నారు.
రోళ్లవాగు పరిశీలన
సారంగాపూర్: రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణానికి ఏమైనా నష్టం ఉందా..? అనే అంశంపై అటవీశాఖలో అడవుల పరిరక్షణ బృందం మంగళవారం వివరాలు సేకరించింది. డిప్యూటీ కన్జర్వేటర్ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఏడుగురు సీనియర్ ఫారెస్ట్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ, ఇంజినీరింగ్ అధికారులు పంపిన నివేదికలోని వివరాలు సరైనవేనా..? వన్యప్రాణులకు ఎంత మేర నష్టం జరగనుంది..? ఎన్ని చెట్లు కోలోతున్నాం..? వంటి అంశాలు సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారి వెంట ప్రాజెక్టు డీఈ చక్రూనాయక్, ఏఈ అనిల్, సూపర్‌వైజర్ మోహన్ తదితరులు ఉన్నారు.
బల్దియా ప్రజలకు శుద్ధనీరు అందిస్తాం