సారంగాపూర్: ప్రభుత్వం నిర్ధేశించిన నమూనాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. చిత్రవేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ స్థలాలు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల ప్రగతిని పరిశీలించారు. దశలవారీగా బిల్లులు చెల్లించనున్నట్లు వివరించారు. బీర్‌పూర్‌లో రూ.1.43 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. నిధులు ఉన్నా పనుల జాప్యమెందుకని ప్రశ్నించారు. కొల్వాయి, తాళ్లధర్మారం, లక్ష్మీదేవిపల్లిలో రూ.20లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్న పల్లె దవాఖానాల పనులను పరిశీలించారు. డీపీవో మదన్‌మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, డీఈ మిలింద్, తహసీల్దార్లు జమీర్, ముంతాజొద్దీన్, ఎంపీడీవోలు గంగాధర్, లచ్చాలు, ఎంపీవో సలీం ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా అధికారులు, ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు, రైస్‌మిల్లర్లతో సమీక్షించారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలన్నారు. రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, క్లీనింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, సివిల్ సప్లై డీఎం జితేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఇఫ్తార్
జగిత్యాల: కలెక్టరేట్‌లో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకునే స్ఫూర్తి, సహాయ సహకారాలు పెంపొందించుకునే గొప్ప సమయం రంజాన్ అన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో హకీం, వకీల్, నాగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.