నేడు బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం

Mar 23 2025 9:05 AM | Updated on Mar 23 2025 9:01 AM

● ముఖ్య అతిథులుగా కేటీఆర్‌, హరీశ్‌రావు

కరీంనగర్‌: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం ఆదివారం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్‌లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీకన్వెన్షన్‌ ఫంక్షన్‌హాల్‌ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్‌ మెంబర్లు, డివిజన్‌ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకం

కోరుట్ల: కేంద్రప్రభుత్వం తీసుకొస్తామంటున్న జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన పార్లమెంట్‌ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే దక్షినాది రాష్ట్రాలకు ప్రాతినిథ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల అజయాయిషీ పెరిగి నష్టపోతామన్నారు. దేశంలో నక్సలిజం, కమ్యూనిస్టులను రూపుమాపే యత్నాలు జరుగుతున్నాయన్నారు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పార్టీ జిల్లా నేతలు వెన్న సురేష్‌, చెన్నా విశ్వనాథం, సుతారి రాములు, కొక్కుల శాంత, రాధ, మౌలాన, ముఖ్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement