జగిత్యాల: వృద్ధులను విస్మరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏవో తఫజుల్ హుస్సేన్ అన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో పొలాస గ్రామానికి చెందిన నర్సవ్వ, పట్టణానికి చెందిన భారతి, ధర్మపురి మండలం జైనకు చెందిన బాలమ్మ, సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన బుచ్చవ్వ, మల్యాల మండలం పోతారానికి చెందిన కస్తూరి రాజంవీరు కుమారులు, కూతుళ్లు, కోడళ్లు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 2007 సంరక్షణ చట్టం ప్రకారం వారిని ఆదుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికీ చాలామంది శిక్ష పడిందని పేర్కొన్నారు. విచారణకు హాజరు కాని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్
జగిత్యాలటౌన్: గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన గ్రీన్‌చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్ ప్రభుత్వానికి సూచించారు. కార్మికులకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాలని జిల్లా కమిటీ ఆధర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయ పాలనాధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీపీ సిబ్బందికి నష్టదాయకంగా మారిన జీవో 51ను సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేసి, పాత కేటగిరీలను అమలు చేయాలని కోరారు. బకాయిల చెల్లింపులకు పంచాయతీల నుంచి కార్యదర్శులు చెక్కులు అందించి మూడు నెలలు గడుస్తున్నా నిధులకు మోక్షం కలగలేదన్నారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు ఉన్నారు.
వృద్ధులను విస్మరిస్తే చర్యలు