బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 10 మంది బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
నేడు జాతీయ రైతు దినోత్సవం
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు పరిశోధన స్థానం డైరెక్టర్ హరీష్‌కుమార్ శర్మ తెలిపారు. వివిధ పంటల్లో సాగు వివరాలపై సదస్సులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
షాపుల నిర్వహణకు వేలం
జగిత్యాలరూరల్: దుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి కోసం షాపుల నిర్వహణకు వేలం వేశారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి నిర్వహణకు 12 రోజులకు రూ.4 లక్షలు, కొబ్బరిముక్కల సేకరణకు రూ.2.60 లక్షలు, చలువపందిళ్ల నిర్మాణానికి రూ.1.20 లక్షలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్‌కు రూ.84,400, టెంట్లు రూ.78 వేలు, రంగులు, సున్నం వేసేందుకు రూ.1.25 లక్షలు, మహాశివరాత్రి పూల అలంకరణకు రూ.93,940 కేటాయించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమౌళి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పొరండ్ల శంకరయ్య, రెనోవేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం


