యావర్‌రోడ్డు విస్తరిస్తేనే రాజకీయాల్లో కొనసాగుతా..
జగిత్యాల: జిల్లాకేంద్రంలో ప్రధాన సమస్య యావర్‌రోడ్డు అని, ఆ రోడ్డు విస్తరిస్తేనే రాజకీయాల్లో కొసాగుతానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో కలిసిన ఆయన నియోజకవర్గ ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు. యావర్‌రోడ్డు 2001కు ముందు 80 ఫీట్ల రహదారిగా ఉండేదని, వ్యాపార సముదాయాలతో.. అతి తక్కువ నివాస ప్రాంతాలతో ఉండేదని, దీనిని విస్తరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీస్టేడియం నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. రూ.204 కోట్లతో నిర్మించనున్న ఆస్పత్రి బిల్డింగ్‌కు త్వరలో సీఎం, మంత్రులు భూమిపూజ చేస్తారని తెలిపారు.


