ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి
జగిత్యాల: ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ సమర్థవంతంగా చేపట్టాలని, ఓటరు జాబితాలో ఉన్న డెమోగ్రఫిక్ సిమిలర్ ఎంట్రీలను జాగ్రత్తగా గుర్తించాలన్నారు. ముఖ్యంగా బ్లర్ ఫొటోలు ఉన్న ఓటరు ఎంట్రీలు, ఒకే వ్యక్తికి సంబంధించిన సమాన వివరాలతో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు.
నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ అన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు, లోపాలు సరిదిద్దాలన్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం సరిచేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సూపర్‌వైజర్లు, బూత్‌స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి ఓటరు జాబితా రూపొందించాలని ఆదేశించారు.


