యాసంగికి ఎస్సారెస్పీ నీరు
నీరు పుష్కలం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
జిల్లా రైతులకు ఎస్సారెస్పీ సాగునీరే ప్రాణాధారం. బా వులు ఉన్నప్పటికీ ప్రాజెక్టు నీళ్లు రాకపోతే ఎండిపోతాయి. ఈ సారి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నందున ఆన్, ఆఫ్ ప ద్ధతి కాకుండా రెగ్యులర్‌గా సాగునీరు అందించాలి. – పడిగెల రవీందర్ రెడ్డి, రాయికల్
ఎస్సారెస్పీ నీరు ఎప్పుడు విడుదల చేస్తారా..! అని ఎదురు చూస్తున్నాం. ఈనెల 24 నుంచి విడుదల చేయనున్నట్లు తెలిసింది. కాలువ చివరి భూములకు నీరు అందాలంటే ఎప్పటికప్పుడు అధికారులు కాలువలపై మానిటరింగ్ చేయాలి. – గడ్డం గంగారెడ్డి, చల్‌గల్, జగిత్యాల రూరల్
ప్రస్తుతం ఎస్సారెస్పీ నిండుకుండలా ఉంది. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 949.754 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా.. 882.040 టీఎంసీల నీటిని బయటకు వదిలారు. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు ప్రస్తుతం (80.5 టీఎంసీలకు 80.053 టీఎంసీలు) అంతేమొత్తం నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి కోరుట్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలకు మిషన్ భగీరథ కింద 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
యాసంగికి ఎస్సారెస్పీ నీరు
యాసంగికి ఎస్సారెస్పీ నీరు


