కొండగట్టులో సరిహద్దు వివాద స్థలం సర్వే
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, అటవీశాఖ భూముల సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం ఆర్డీవో మధుసూదన్, అటవీశాఖ అధికారి రవికుమార్ స్థలాన్ని పరిశీలించారు. కొండగట్టులో అటవీశాఖకు చెందిన ఆరెకరాల భూమి దేవాదాయశాఖ ఆక్రమించారంటూ గతంలో కొండగట్టు ఆలయ అధికారులకు నోటీసులు జారీ చేయగా.. కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో డీఎఫ్‌ఓ రవికుమార్, ఆర్డీఓ మధుసూదన్ సమక్షంలో డిప్యూటీ సర్వేయర్ విఠల్ వివాద భూముల సర్వే చేపట్టారు. ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, మల్యాల తహసీల్దార్ కె.వసంత, కొడిమ్యాల తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్‌ఐ తిరుపతి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.


