జీవాలకు నట్టల నివారణ మందులు
మెట్‌పల్లిరూరల్: మూగజీవాల సంరక్షణ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును (డీవార్మింగ్) ఉచితంగా పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం.. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు, 31 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 45 ఉప పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలోని గొర్రెలు, మేకలకు పశువైద్యాధికారులు నివారణ మందులు వేస్తున్నారు. ఈ కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగనుంది. గొర్రెలు,మేకలు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రెండేళ్లలో సరఫరా కానీ మందులు..
రెండేళ్లుగా ప్రభుత్వం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును సరఫరా చేయలేదు. దీంతో చాలా మంది రైతులు ప్రైవేట్‌లో కొనుగోలు చేసి జీవాలకు వేశారు. ప్రస్తుతం ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసే పనిలో నిమగ్నమయ్యా రు. మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వనియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
తప్పనిసరిగా వేయించాలి
జీవాల్లో నట్టల నివారణకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందులు వేస్తున్నాం. ఇందుకోసం ముందుగానే జీవాల పేడ నమునాలను సేకరించి పరిశీలించాం. వాటి ఆధారంగా అవసరమైన మందులు వేస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ మనీషాపటేల్, పశువైద్యాధికారి, మెట్‌పల్లి
జీవాలకు నట్టల నివారణ మందులు


