పైడిపల్లిలో ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం
వెల్గటూర్: పైడిపెల్లి గ్రామంలో నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలో నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. రీపోలింగ్ జరపాలని, ప్రమాణ స్వీకారం ఆపాలని గ్రామస్తుల డిమాండ్ల నేపథ్యంలో ప్రమాణస్వీకారంపై కొంత అయోమయం నెలకొంది. పోలీసుల ప్రత్యేక బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నూతన సర్పంచ్ గంగుల మంగ ప్రమాణ స్వీకారం చేశారు.
ఒకే కుటుంబం నుంచి ఉపసర్పంచ్, ఇద్దరు వార్డుసభ్యులు
కథలాపూర్: మండలంలోని ఊట్‌పల్లిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వార్డుసభ్యులుగా గెలుపొందారు. వీరిలో ఒకరు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన ముదాం శేఖర్ 8వ వార్డుసభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ అయ్యారు. ఆయన పెద్దమ్మ ముదాం రాజమణి రెండో వార్డుసభ్యురాలిగా, శేఖర్ పెద్దనాన్న కుమారుడు ముదాం ప్రమోద్ ఒకటో వార్డు నుంచి గెలుపొందారు.
ముదాం రాజమణి
ముదాం ప్రమోద్, ముదాం శేఖర్
రాయికల్: మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీలో సర్పంచ్, వార్డుసభ్యులు, చివరకు కార్యదర్శి కూడా మహిళే కావడం విశేషం. సర్పంచ్‌గా రాధికగౌడ్, ఒకటో వార్డు సభ్యురాలుగా కూస దేవమ్మ, రెండో వార్డు మెంబర్‌గా శేర్ కిష్టమ్మ, మూడోవార్డ్ మెంబర్‌గా కొంపల్లి సుమలత, నాలుగో వార్డు సభ్యురాలుగా కొంపల్లి ప్రియాంక గెలుపొంది సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రమాణం చేశారు. వారితో మహిళాకార్యదర్శి అయిన పుష్పలత ప్రమాణం చేయించారు.
పైడిపల్లిలో ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం
పైడిపల్లిలో ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం


