భార్య ఉపసర్పంచ్.. భర్త వార్డుమెంబర్
కథలాపూర్: మండలంలోని ఇప్పపల్లి పంచాయతీలో భార్యాభర్తలు చెన్నవేని సు జాత, రంజిత్ కుమార్ వార్డుసభ్యులుగా గెలిచారు. వీరిలో సుజాత ఉపసర్పంచ్‌గా నియామకం అయ్యా రు. సోమవారం ఆమె ఉపసర్పంచ్‌గా.. ఆమె భర్త రంజిత్‌కుమార్ వార్డుసభ్యుడిగా ప్రమాణం చేశారు.
బోర్నపల్లి సర్పంచ్‌గా 70 ఏళ్ల రాజవ్వ
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కొడిపల్లి రాజవ్వ సర్పంచ్‌గా బరిలో నిలిచి గెలుపొందారు. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సేవ చేయడానికి వయస్సు అడ్డుకాదని, నిరుపేదలకు సేవ చేయడమే తమ పాలకవర్గ లక్ష్యమని తెలిపారు.
ప్రమాణం చేసిన రోజే ఉపసర్పంచ్‌కు రాజీనామా
ధర్మపురి: ఉపసర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీవోకు లేక సమర్పించిన ఘటన మండలంలోని కమలాపూర్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి ఎన్నికల్లో రాజూరి శ్రీనివాస్‌గౌడ్ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఆయనను ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అయితే సోమవారం ప్రమాణం చేసిన ఆయన.. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీవో నరేష్‌కుమార్‌కు లేఖ సమర్పించారు.
భార్య ఉపసర్పంచ్.. భర్త వార్డుమెంబర్


