జగిత్యాల: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో రాము అన్నారు. ఈనెల 21 నుంచి జరిగే పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను గుర్తించామని, ఏ కేటగిరిలో 25, బీ కేటగిరిలో 20, సీ కేటగిరిలో 22 కేంద్రాలను కేటాయించామన్నారు. మొత్తంగా 11,850 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 826 మంది ఇన్విజ్‌లేటర్లను నియమించామన్నారు. అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు.