జగిత్యాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు, బాధితులకు అందించాల్సిన లబ్ధిపై సభ్యులతో చర్చించారు. ఎస్సీ, ఎస్టీల భూములను ఇతరులు కబ్జా చేయకుండా చూడాలని, కేసులను పరిష్కరించేలా చూడాలని కమిటీ సభ్యులు కోరారు. ప్రతినెలా జరిగే పౌరహక్కుల దినోత్సవంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎస్సైలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, డీఎస్పీలు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి బదిలీ
మెట్‌పల్లి: మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. ఆయన స్థానంలో కరీంనగర్ ఎస్‌బీ సీఐగా పనిచేస్తున్న వి.అనిల్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అట్రాసిటీ కేసులను త్వరగా పరిశీలించాలి