ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు పుష్పయాగం, ఏకాంతోత్సవాన్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామికి పుష్పయాగం చేశారు. శ్రీలక్ష్మినృసింహస్వామివారికి ఏకాంతోత్సవం జరిపించారు. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో వివిధ రకాల పూలతో అలంకరించారు. స్వామివారి సేవపల్లకీతో ఐదు ప్రదక్షిణలు చేసి ఏకాంతోత్సవాన్ని పూర్తిచేశారు. ఈవో శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ఉప ప్రధా న అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచారి ఉన్నారు.
వెంకన్నకు పుష్పయాగం.. నృసింహునికి ఏకాంతోత్సవం