విద్యార్థులు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ చదవాలి. కీలక పదాలు రాసిపెట్టుకుని వాటిని గుర్తించుకుని ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలు రాయాలి. తప్పులు లేకుండా చక్కగా రాస్తే మంచి మార్కులు సాధించొచ్చు. పాఠాలు, గ్రాఫ్స్, పట్టికలు, పటాలవంటి అంశాల్లో సాధన చేయాలి. అభ్యాస దీపిక చదివితే మార్కులు పెరిగే అవకాశం ఉంది. పేరగ్రాఫ్ విశ్లేషణ చేస్తున్నప్పుడు పేరాలోని అంశాన్ని మరింత వివరించాలి. ప్రముఖుల లక్షణాలు, ఆశయాలు, నినాదాలు గుర్తుంచుకోవాలి. భారతదేశం, తెలంగాణ అవుట్ లైన్ మ్యాప్ గీయగలగాలి. ప్రపంచపటంలో దేశాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, పట్టణాలు, ఏడారులును జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
– రవి, సోషల్ టీచర్, జెడ్పీహెచ్‌ఎస్, ఆరపెల్లి