కేటీఆర్‌ సార్‌.. నాలాంటి కడుపుకోత ఎవరికీ వద్దు | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ సార్‌.. నాలాంటి కడుపుకోత ఎవరికీ వద్దు

May 9 2023 7:30 AM | Updated on May 9 2023 7:47 AM

- - Sakshi

సిరిసిల్లటౌన్‌: ‘కేటీఆర్‌ సార్‌.. ప్రైవేట్‌ వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఇటువంటి కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రానివ్వద్దంటూ.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈమేరకు కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, డీఎంహెచ్‌వో సుమన్‌రావులకు సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాలు.. ముస్తాబాద్‌ మండలం తుర్కపల్లికి చెందిన కర్రోళ్ల జ్యోతి– రాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు 7 సంవత్సరాలు, చిన్నకూతురు 5 నెలల వయస్సు. కొద్ది రోజుల క్రితం చిన్నపాప ఆరోగ్యం బాగా లేక వాంతులు అవుతుంటే సిరిసిల్ల పాతబస్టాండు సమీపంలోని ఓ పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు.

వైద్యులు ఫిట్స్‌ వస్తున్నాయని తమ ఆస్పత్రికి అనుబంధమైన మరో ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. రోజులో నాలుగు సార్లు ఫిట్స్‌ వస్తున్నాయని పాపకు అధిక డోసులో మందులు ఇచ్చారని, దీంతో వైద్యులతో గొడవపడి హైదరాబాద్‌ తీసుకెళ్తుండగా పాప స్పర్ష కోల్పోయింది. హైదరాబాద్‌ ఆస్పత్రిలోని వైద్యులు పరీక్షలు చేసి మెదడువాపుగా గుర్తించి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. కాగా సిరిసిల్లలో అందిన వైద్యం వికటించడంతోనే పాప ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఈవిషయంలో న్యాయం జరుపాలని మంత్రిని కోరారు.

ఎలాంటి విచారణకై నా సిద్ధం
పాపకు జరిగిన హానిలో తమ పొరపాటు ఏమిలేదని చికిత్స అందించిన వైద్యుడు వివరించారు. పాపకు వాంతులని ఏప్రిల్‌ 26న తీసుకురాగా ఫిట్స్‌గా గుర్తించి ట్రీట్‌మెంట్‌ ఆరంభించాం. మావద్ద రికవరీ అవుతుందని చెప్పినా వినలేదు. హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయిందని తెలిసింది. ఐసీయూలో పాపను అబ్జర్వేషన్‌ కోసమే మా అనుబంధ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాం. మావద్ద చికిత్సలో ఏలాంటి పొరపాటు జరుగలేదు. పాప తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల్లో ఏలాంటి నిజం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement