Woman Eats Her Dead Husband Ashes: భర్తపై ఎనలేని ప్రేమ.. అతని చితాభస్మం కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ..

Woman Eats Her Dead Husband Ashes Says She Can Not stop - Sakshi

బ్రిటన్‌: మద్యానికి, డ్రగ్స్‌కి అడిక్ట్‌ అయ్యే వాళ్లని చాలా మందిని చూసే ఉంటాం. ఇంకా చెప్పాలంటే... టీవి చూడటం, మొబైల్‌ ఫోన్‌ అధికంగా వాడటం, సోషల్‌ మీడియాలోనే గంటల తరబడి మునిగిపోయేవాళ్లు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ బ్రిటన్‌కి చెందిన ఒక మహిళ మాత్రం తన భర్త చితాభస్మానికి బానిస అయ్యాను దాన్ని ఆపడం తన వల్ల కాదంటూంది. చాలా వింతగా ఉందనిపిస్తుందా? అయితే అసలు విషయంలోకి వెళ్లితే బ్రిటన్‌కి చెందిన కాసీ 2009లో సీన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

(చదవండి:  ఏంటీ....స్నేక్‌ కేక్‌ ఆ!)

అయితే అతను ఆస్తమా కారణంగా మరణించాడు. ఈ క్రమంలో ఆమె అప్పటి నుంచి తన భర్త చితాభస్మాన్ని తాను ఎక్కడకెళ్లితే అక్కడకి తనతోపాటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఈ మేరకు ఆమె తన భర్త చితాభస్మాన్ని కూడా తింటున్నానని దాన్ని ఆపలేనంటూ చెప్పుకొచ్చింది. పైగా ఆ బూడిద కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ చాలా ఇష్టంగా కొచెం కొంచెంగా తింటున్నానంటూ చెబుతోంది.

ఆమె తన భర్తను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టాయలని అనుకోవట్లేదని తనతోపాటు ఉన్నట్లుగా భావిస్తున్నందుకే ఇలా చేస్తున్నాను అంటోంది కాసీ. ఈ మేరకు బ్రిటన్‌ టీఎల్‌సీ ఛానెల్‌లోని 'మై స్ట్రేంజ్‌ అడిక్ట్‌' అనే కార్యక్రమంలో కాసీ తన వింత అలవాటు గురించి చెబుతూ నేను రోజు నా భర్త చితా భస్మాన్ని తింటున్నాను అంటూ పేర్కొంది. అంతే కాదండోయ్‌ అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురి అవ్వడంతోపాటు ఆమెపై ఒక కథనాన్ని కూడా ప్రచురితమైంది. దీంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. 

(చదవండి: తలపాగే ప్రాణాలను కాపాడింది)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top