వెరైటీగా మొక్కజొన్న తినాలకుంటే జుట్టూడింది! | Shocking: Woman Adopts Unique Method to Eat Corn, But Her Hair Is In Danger Video Goes Viral - Sakshi
Sakshi News home page

Unique Method to Eat Corn: అలా మొక్కజొన్న తినాలకుంటే జుట్టూడింది!

Oct 2 2023 1:58 PM | Updated on Oct 2 2023 5:29 PM

Woman Adopts Unique Method to Eat Corn - Sakshi

సోషల్ మీడియా అనేది వాకింగ్ కామెడీ షో లాంటిది. ఎవరైనా సోషల్ మీడియా సముద్రంలోకి దూకినప్పుడు వింతలు విడ్డూరాలు అనేకం కనిపిస్తాయి. ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఒక యువతి మొక్కజొన్న తినడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి భంగపడింది. ఈ వీడియోను చూసిన వారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. 

వైరల్ వీడియోలో డ్రిల్ మెషిన్‌కు మొక్కజొన్న పొత్తు గుచ్చి, ఒక అమ్మాయి దానిని తినేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వరకు అంతా బాగానే ఉంది. తరువాత  ఒక్కసారిగా ఆమె జుట్టు కొద్దిమేరకు మెషీన్‌లో ఇరుక్కుపోయి ఊడిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో Twitter)లో @ZeroIQPeople అనే పేజీలో ఈ వీడియో పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకూ 15 వేల 600 మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్‌.. ‘అందుకే యువతులు పవర్ టూల్స్‌కు దూరంగా ఉండాలని చెప్పేది’ అని రాశాడు. మరో యూజర్‌ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement