గాలిలో హ‌నీమూన్‌: లారీల‌ను దాటుతూ | Viral Video: 5 Seconds Honeymoon In Air On Bed | Sakshi
Sakshi News home page

గాలిలో ఐదు సెకండ్ల హ‌నీమూన్‌

Jul 31 2020 3:05 PM | Updated on Jul 31 2020 3:12 PM

Viral Video: 5 Seconds Honeymoon In Air On Bed - Sakshi

పెళ్లిని ఘ‌నంగా చేయాల‌ని వ‌ధూవ‌రుల కుటుంబాలు ఎన్నో క‌లలు కంటాయి. తీరా పెళ్లి చేసి వారు బాధ్య‌త తీర్చుకోగానే కొత్త పెళ్లి జంట హ‌నీమూన్‌కు రెడీ అవుతుంది. అందు కోసం రాష్ట్రాలు, దేశాలు దాట‌డానికైనా వెన‌కాడ‌రు. అయితే ఓ కొత్త‌జంట మాత్రం హ‌నీమూన్‌ను మ‌రీ వెరైటీగా చేసుకొని వార్త‌ల్లో నిలిచింది. గాలిలోనే హ‌నీమూన్ జ‌రుపుకుంది. అది కూడా కేవ‌లం 5 సెకండ్లు మాత్ర‌మే. చ‌క్రాల మంచంపై భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ చేరి ఎత్తైన కొండ మీద నుంచి కింద‌కి జారారు. (ఆలుమ‌గ‌ల గొడ‌వ‌: యూట్యూబ్‌లో వీడియోలు డిలీట్‌)

ఆ త‌ర్వాత గాల్లోకి ర‌య్‌మ‌ని ఎగురుతూ అక్క‌డుకున్న ఎనిమిది లారీల‌ను దాటుకుని అవ‌త‌లకు జారుడు బండ జారిన‌ట్లుగా ప‌డ్డారు. ఈ క్ర‌మంలో వారికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డం కాస్త ఊపిరి పీల్చుకునే విష‌యం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోను నెటిజ‌న్లు ఊపిరి బిగ‌బ‌ట్టి చూస్తున్నారు. 'మీకెలా ఉందో కానీ చూస్తున్న మాకైతే భ‌యంతో ప్రాణం పోయేలా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. భైర‌వ ద్వీపంలో రాకుమారిని రాక్ష‌సుడు ఎత్తికెళ్లిన స‌న్నివేశాన్ని పోల్చుతూ 'ఇక్క‌డ రాకుమారిని రాజ‌కుమారుడే ఎత్తుకెళ్తున్నాడు' అని ఛ‌లోక్తులు విసురుతున్నారు. (నవ దంపతులకు హనీమూన్‌ కష్టాలు!)

Advertisement
 
Advertisement
Advertisement