ఆస్కార్‌ లెవల్‌ యాక్టింగ్‌.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి! | Viral: Tiger Reaction While Return To The Wild | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ లెవల్‌ యాక్టింగ్‌.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!

Oct 10 2022 4:45 PM | Updated on Oct 10 2022 4:45 PM

Viral: Tiger Reaction While Return To The Wild - Sakshi

అన్నం కోసం వెళ్తే.. అమృతం దొరికినట్లు.. మూవీ చూద్దామని వెళ్తే.. మెగాస్టార్‌ ఎదురొచ్చినట్లు..కొన్నిటిని వర్ణించడానికి మాటలు సరిపోవు.. అలాంటి సన్నివేశమే ఇది.. ఉరిశిక్ష పడి.. నేడో రేపో ప్రాణం తీసేస్తారు అన్నోడికి సడన్‌గా క్షమాభిక్ష పెట్టేస్తే వాడి ఫీలింగ్‌ ఎలా ఉంటుంది? తెలీదు కదా.. కొంచెం అటూఇటూగా ఇలాగే ఉంటుందేమో.. ఓసారి పులిగారి మనోభావాలను గమనించండి.. 

ఇంతకీ విషయమేమిటంటే.. చాలాకాలం బోను వెనుకాల బందీగా ఉన్న పులికి ఒక్కసారిగా స్వాతంత్య్రం ప్రకటించేసి.. అడవిలో వదిలేయడానికి తెచ్చారు. బోను తలుపు తీయగానే.. అడవిని చూసి పులి ఇలా షాక్‌ తింది.. పలు జంతువులను ఇటీవల అడవిలో వదిలినప్పుడు అవి ఎలా ఫీలయ్యాయి అన్నది ఓ వీడియో తీశారు. అందులోనిదే ఈ పులి చిత్రం..ఆస్కార్‌ లెవల్‌ యాక్టింగ్‌ కదా..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement