పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్‌

US Teen Birthday Attends Thousands Revellers Police Arrest 150 - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డ్రైయన్‌ లోపెజ్‌ తన 17వ పుట్టిన రోజుకు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నాడు. వెంటనే సోషల్‌ మీడియాలో “అడ్రియన్స్ కిక్‌బ్యాక్”  పేరుతో ఆహ్వానాన్ని షేర్‌ చేశాడు. అయితే స్కూల్‌ మిత్రుల కోసం పంపిన ఆహ్వానాన్ని లోపెజ్ స్నేహితుడు యాహిర్ హెర్నాండెజ్ (16) తన స్నాప్‌చాట్, టిక్‌టాక్ ఖాతాలలో పోస్ట్ చేశాడు. దీన్ని కొందరు సోషల్‌ మీడియా సెలబ్రెటీలు షేర్‌ చేశారు. దీంతో 280 మిలియన్ల నెటిజన్లు “అడ్రియన్స్ కిక్‌బ్యాక్”ను వీక్షించారు. దీంతో దాదాపు 2500 మంది రావడంతో పార్టీని హంటింగ్టన్ బీచ్ నుంచి లాస్‌ ఏంజల్స్‌లో మరో చోటుకు మార్చారు.

అయితే “అడ్రియన్స్ కిక్‌బ్యాక్”లో డబ్బులు పెట్టి టికెన్‌ కొన్న వారు ఈ విషయం తెలియక అక్కడకు వచ్చి పాటలు పెట్టుకుని..రోడ్డు పై వెళ్లే వాహనాలపై సీసాలు విసరడం మొదలుపెట్టారు. దాంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు లాస్ ఏంజిల్స్‌లో రాత్రిపూట అత్యవసర కర్ఫ్యూ విధించారు. ఆ పార్టీ ప్రారంభించక ముందే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని మూసివేశారు. దీంతో గుంపులోని నుంచి పోలీసుల పై కాల్పులు జరిపారు. కాగా పోలీసులు పార్టీకి వచ్చిన దాదాపు 150 మందిని అరెస్ట్‌ చేశారు.

(చదవండి: Kamal Nath: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top