Kamal Nath: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు!

Kamal Nath Hits Back At Centre After Criticism Bharat Mahan Comments - Sakshi

భోపాల్‌: కోవిడ్‌-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌పై మే 24న కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కమల్‌ నాథ్‌ శనివారం స్పందించారు. కరోనాకు సంబంధించిన  వాత్సవ లెక్కలను వెల్లడించాలని కోరితే బీజేపీ పాలకులు తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంతో గొప్ప దేశమైన భారత్‌లో ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నిస్తే తనను దేశద్రేహి అంటున్నారని అన్నారు.

కోవిడ్‌ కారణంగా ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారు. వాటి వివరాలను అడిగితే రాజకీయాలు చేస్తున్నానని అంటున్నారంటూ విమర్షించారు. వ్యాక్సిన్‌లకు సంబంధించిన వివరాలను అడిగితే తప్పేంటని కమల్‌ నాథ్‌ ప్రశ్నించారు.  ఇక శుక్రవారం "మేరా భారత్ మహాన్ నహీ హై, బాడ్నం హై (నా దేశం గొప్పది కాదు..అపఖ్యాతి పాలైనది) అనే వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

(చదవండి: కరోనా విజృంభణ..భయాందోళనలో గ్రామస్తులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top