ర‌క్ష‌ణ విషయంలో రష్యాపై ఆధారపడొద్దు: అమెరికా

US Pentagon Says Discourages India Reliance On Russia For Defence Needs - Sakshi

భారత్‌-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ ర‌క్ష‌ణ అవ‌స‌రాలకు సంబంధించి ర‌ష్యాపై ఆధార‌ప‌డటాన్ని ఏమాత్రం తాము ప్రోత్సహించడంలేదని యూఎస్‌ రక్షణ కార్యాలయం పెంటగాన్‌ అభిప్రాయపడింది. భారత్‌ రక్షణ అవసరాల విషయంలో రష్యాలపై అధికారపడటం మానుకోవాల‌ని పేర్కొంది. భారత్‌తో పాటు ఇత‌ర దేశాలు కూడా ర‌క్ష‌ణ అవ‌స‌రాల కోసం ర‌ష్యాపై ఆధార‌ప‌డ‌డం ఆపేయాల‌ని భావిస్తున్నామ‌ని వెల్లడించింది. 

ఈ విషయంలో త‌మ‌కు ఎటువంటి ఉద్దేశంలేద‌ని తెలుపుతునే.. ఆ అంశాన్నిఎట్టిపరిస్థితుల్లో ప్రోత్స‌హించ‌మ‌ని పెంట‌గాన్ ప్రెస్ సెక్ర‌ట‌రీ జాన్ కిర్బీ తెలిపారు. భార‌త్‌తో ఉన్న ర‌క్ష‌ణ బంధానికి తాము విలువ ఇస్తామ‌ని అదేవిధంగా అమెరికా-ఇండియా మ‌ధ్య ఉన్న బంధం మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు. ఉప‌ఖండంలో భ‌ద్ర‌త‌ను క‌ల్పించేది భార‌త్ అని ఆ విష‌యాన్ని తాము ఎల్లప్పుడు గుర్తిస్తామ‌ని తెలిపారు.

2018లో ట్రంప్ ప్రభుత్వం నిరాక‌రించినా భారత్‌ మాత్రం ర‌ష్యా నుంచి ఎస్‌-400 ట్రియంప్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్ల‌ను కొనుగులుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్‌-400 మిస్సైళ్లు కొనుగోలు చేసిన ట‌ర్కీపైన అమెరికా నిషేధం విధించిన విషయం విదితమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top